Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన పిచ్చి చేష్టలతో మంటలు రాజేసిన కోతి!

  • పొయ్యిలోని కొర్రును తీసుకెళ్లిన కోతి
  • ఆపై చెట్టెక్కి మంటపెట్టిన మర్కటం 
  • కాసేపు ఆందోళన చెందిన ప్రజలు
తాను తినేందుకు ఏమీ దొరకలేదన్న కోపంతో ఓ కోతి చేసిన పిచ్చి చేష్టలు ప్రజలను కాసేపు భయాందోళనలకు గురిచేశాయి. ఆ వివరాలలోకి వెళితే, గోదావరి ఖని సమీపంలోని సెంటినరీ కాలనీలో జనగామ వెంకటేశ్ అనే యువకుడు కొన్ని తినుబండారాలను తీసుకుని వెళుతుండగా, ఓ కోతి వాటిని లాక్కోబోయింది. దీంతో వెంకటేష్ పక్కనే ఉన్న ఓ కర్రను తీసుకుని దాన్ని బెదిరించాడు.

దీంతో కోపం తెచ్చుకున్న ఆ కోతి, పక్కనే ఉన్న పొయ్యిలోని ఓ మండుతున్న కర్రను అందుకుని, పక్కనే ఉన్న తాటిచెట్టు ఎక్కింది. తాటికొమ్మలకు మంటలు అంటుకుని, పక్కనున్న చెట్లకు మంటలు వ్యాపించాయి. తొలుత పిడుగు పడి చెట్లు కాలుతున్నాయని అక్కడి వారు భావించారు. దీంతో అవి ఎక్కడ ఇళ్లపై పడతాయోనని గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.

ఆపై మంటలు చెట్ల వరకూ మాత్రమే పరిమితం కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతా చేసిన ఆ మర్కటం, అదే కొర్రును పట్టుకుని తాటిచెట్టు కిందనే కూర్చుని ఉండటాన్ని చూసిన ప్రజలు ఔరా అని అశ్చర్యం వ్యక్తం చేశారు.
Monkey
Fire
Godavari Khani

More Telugu News